![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -998 లో..... రాజు లక్కీ ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి సాహోతో రాజు పేరెంట్స్ సరదాగా కబుర్లు చెప్తుంటారు. నీ ఫ్రెండ్ సాహో మంచిగా చాపలు తీసుకొని వచ్చాడ్రా అని లక్ష్మి చెప్తుంది. అప్పుడే దెబ్బలతో వెంకీ ఎంట్రీ ఇస్తాడు. ఏమైంది రా అని రాజు అడుగుతాడు. రాజుకి దగ్గరగా సాహో వచ్చి అదంతా నా పనే.. నేను చెప్పింది నువ్వు చెయ్యకపోతే విషయం ఇంకా సీరియస్ అవుతుందని రాజుకి సాహో వార్నింగ్ ఇస్తాడు. దాంతో రాజులో టెన్షన్ మొదలవుతుంది. రేయ్ లక్కీ వెంటనే ఐశ్వర్యకి ఫోన్ చేసి నేను తన డిలీంగ్ కి ఒకే అన్నానని చెప్పమని రాజు అంటాడు. దాంతో ఐశ్వర్యతో కలవాలని చెప్తాడు లక్కీ. కాసేపటికి ఐశ్వర్యని రాజు, లక్కీ వాళ్ళు కలుస్తారు. మేం కిడ్నాప్ చేసేవాళ్ళలాగా కన్పిస్తున్నామా అని అన్నారు.. ఇప్పుడు మీ అంతటా మీరే వచ్చారు ఏంటని ఐశ్వర్య అడుగుతుంది.
నీకు అదంతా అనవసరం.. ముందు ఎవరిని కిడ్నాప్ చెయ్యాలో చెప్పమని రాజు అడుగుతాడు. ఇందుని అని ఐశ్వర్య చెప్పగానే తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలాగా ఉంది.. తనని కిడ్నాప్ చేస్తే ఏమోస్తుందని రాజు అంటాడు. రేపు తన బర్త్ డే తను ఒక సంతకం పెడితే కోట్ల ఆస్తులు వస్తాయని మా ఆంటీ చెప్పింది.. ఇప్పుడు తనని కిడ్నాప్ చేసి మా ఆంటీని డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేద్దామని ఐశ్వర్య అంటుంది. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. మరొకవైపు ఇందు కిచెన్ లో వంట చేస్తుంటే భ్రమరాంబ లేని ప్రేమ నటిస్తుంది. అప్పుడే ఐశ్వర్య వచ్చి ఇదంతా రేపటి కోసమే కదా అని వెటకారంగా మాట్లాడుతుంది.. ఆ తర్వాత రేపు ఇందు బర్త్ డే చాలా గ్రాంఢ్ గా ఫామ్ హౌస్ లో చేస్తున్నామని ఇంట్లో వాళ్ళతో రేఖ అనగానే ఆ మాటలు ఐశ్వర్య విని రాజు, లక్కీకి చెప్తుంది.
దాంతో రేపు ఆ ఇందు సంతకం పెట్టేలోపు తనని అక్కడ నుండి కిడ్నాప్ చేస్తానని లక్కీతో రాజు అంటాడు. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని రాజు అనగానే.. అక్కడుంది ఇందు.. నీ శత్రువు తనతో జాగ్రత్త అని లక్కీ అంటాడు. మరొకవైపు సంతకం చెయ్యకని సుభాష్, అపర్ణ ఇద్దరు ఇందుతో చెప్తారు. నాకు ఆ దేవుడే ఏదో ఒకదారి చూపిస్తాడని ఇందు అంటుంది. తరువాయి భాగంలో ఇందుని రేఖ నిద్రలేపి విషెస్ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |